తెలంగాణ

telangana

వరంగల్​లో లాక్​ డౌన్​ కట్టుదిట్టం.. ఇంటికే ప్రజలు పరిమితం..

By

Published : Apr 12, 2020, 7:56 PM IST

వరంగల్ నగరంలోని ప్రజలంతా ఇళ్లు విడిచి బయటకు రావట్లేదు. అత్యవసరమైతే తప్ప అడుగు భయట పెట్టడం లేదు. పోలీసులు తీసుకుంటున్న కఠిన చర్యలే ఈ మార్పునకు కారణంగా స్పష్టమవుతోంది.

'బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు'
'బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు'

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. గత రెండు రోజులుగా లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఫలితంగా నగర వాసులు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్లు విడిచి బయటకు రావట్లేదన్నారు. సిటిజన్ ట్రాకింగ్ యాప్ ద్వారా వాహనాల రాకపోకలకు చెక్ పెట్టిన పోలీసులు భారీ జరిమానాలు సైతం విధిస్తున్నారు. అకారణంగా రోడ్డెక్కే వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం రోజైనా సరే నగరవాసులు బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. వరంగల్ నగరంలోని హన్మకొండ ప్రధాన కూడలి ఎంజీఎం వద్ద రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

ABOUT THE AUTHOR

...view details