వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు అనుబంధంగా హన్మకొండలోని సుబేదారి ప్రాంతంలో నూతనంగా భరోసా కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ కేంద్రంలో వీడియో సమావేశ ప్రాంగణాన్ని వరంగల్ జిల్లా తొమ్మిదో అదనపు కోర్టు న్యాయమూర్తి ముఖ్తిదా ప్రారంభించారు.
భరోసా కేంద్రంలో వీడియో సమావేశం ప్రాంగణం ప్రారంభం మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అందించే సేవలపై సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా న్యాయమూర్తులకు వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు ద్వారా మహిళా బాధితులకు సత్వరమే న్యాయం కల్పించడంతో పాటు సమయం కూడా వృథా కాకుండా ఉంటుందన్నారు. ముఖ్యంగా బాధిత మహిళలకు న్యాయ, పోలీసు వ్యవస్థలపై మరింత నమ్మకం పెరుగుతుందన్నారు.
భరోసా కేంద్రంలో వీడియో సమావేశం ప్రాంగణం ప్రారంభం భరోసా కేంద్రానికి తరలివచ్చిన బాధిత మహిళలకు పోలీసు, మెడికల్, లీగల్, ప్రాసిక్యూషన్ లాంటి సేవలందించవచ్చని అన్నారు. కుటుంబ సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని న్యాయమూర్తి ముఖ్తిదా తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ రీతా లాలా చంద్, భరోసా కేంద్రం ఇంఛార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, భరోసా కేంద్రం అడ్మిన్ స్వాతి, ఇతర సిబ్బంది, నవ్య, రజిత, మానస, పవిత్ర పాల్గొన్నారు.
ఇదీ చూడండి :వేయిస్తంభాల గుడిలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు