వరంగల్ నగరం కరీమాబాద్‌లోని నాగమయ్య తోటలో గత కొద్ది కాలంగా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న నిరుపేదలపై తెరాస నాయకుని అనుచరులు దాడి చేశారు. స్థలాన్ని ఖాళీ చేయాలని గతంలో బెదిరింపులకు పాల్పడ్డారని తాజాగా స్థలాన్ని చదును చేసే క్రమంలో అడ్డువచ్చిన వారిని కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్‌లో నిరుపేదలపై తెరాస నాయకుని అనుచరుల దాడి - క్షతగాత్రులు
తెరాస నాయకుడి అనుచరులు గుడిసెవాసులపై దాడి చేసిన ఘటన వరంగల్ నగరంలో వెలుగు చూసింది. నివాస ప్రాంతం లేక ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారిని ఖాళీ చేయమంటూ దాడి చేశారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు.
తెరాస నాయకుల అనుచరలు దాడి
ఇదీ చూడండి: భర్త వేధింపులు తాళలేక కుమార్తెతో సహా ఆత్మహత్య