వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేశారు. హన్మకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రెండు గంటల పాటు మౌన దీక్ష చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ వారం రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భాజపా, కాంగ్రెస్, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. ప్రభుత్వం పట్టింపులకు పోకుండా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదని కార్మికులు తేల్చి చెప్పారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద మౌన పోరాట దీక్ష
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద మౌన పోరాట దీక్ష