మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు.. కోరమీసాల మల్లన్నను దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు.
కోరమీసాల మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ - మహా శివరాత్రి
వరంగల్ అర్బన్ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలులో భక్తుల రద్దీ ఎక్కువైంది.
కోరమీసాల మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ
బోనాలతో ఆలయం చుట్టూ తిరుగుతూ శివసత్తులు చేస్తోన్న నృత్యాలు.. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాత్రి జరగబోయే పెద్ద పట్నం అనంతరం.. స్వామి వారి కల్యాణం, వాహన సేవ వంటి పలు కార్యక్రమాలను జరుపనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం.. అభిషేకాలతో తన్మయత్వం