అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తి దారుణ హాత్యకు గురైన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్‌లో చోటు చేసుకుంది. బాపూజీ నగర్ కూరగాయల మార్కెట్ సమీపంలోని పరుపుల దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. గత కొంత కాలంగా భిక్షపతి అనే వ్యక్తి... పరుపుల దుకాణం నిర్వహించే ఓ మహిళ మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుంది. మహిళా కుటుంబ సభ్యులు ఇద్దరిని ఎన్నిసార్లు హెచ్చరించినా... పట్టించుకోకపోవడం వల్ల హత్యకు దారితీసింది. గత రాత్రి భిక్షపతి మహిళా దుకాణం వద్దకు రాగా... గమనించిన మహిళా కుటుంబ సభ్యులు కోపోద్రికులై భిక్షపతిపై కర్రలతో దాడిచేశారు.
మహిళతో సంబంధం... కొట్టి చంపిన ఆమె కుటుంబ సభ్యులు - AKRAMA_SAMBHANDHAM_KAARANANGA_VYAKTHI_HATHYA
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పరుపుల దుకాణం నిర్వహిస్తున్న మహిళతో భిక్షపతి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడనే నెపంతో ఆమె కుటుంబ సభ్యులు భిక్షపతి అనే వ్యక్తిని కొట్టి చంపారు.
అక్రం సంబంధం నెపంతో వ్యక్తిని కొట్టి చంపిన మహిళ కుటుంబ సభ్యులు
స్పందించిన స్థానికులు వందకు డయల్ చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి రక్తపు మడుగులో ఉన్న భిక్షపతిని అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భిక్షపతి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మహిళ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నారు.
ఇవీ చూడండి : 'మీరు చేసే సాయం... నా పెనిమిటికి ప్రాణం పోస్తుంది'
TAGGED:
Vyakthi hathya