జన్‌ధన్ ఖాతాల్లో డబ్బులు జమకావడం వల్ల వాటిని తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు బ్యాంకుల వద్దకు వచ్చారు. ఒక్కసారిగా జనం రావడం వల్ల బ్యాంకుల వద్ద రద్దీ పెరిగిపోయింది. వరంగల్ పట్టణంలోని మండిబజార్ వద్ద ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద ప్రజలు బారులు తీరారు. ఖాతాదారులకు సేవలు అందించేందుకు బ్యాంకు సిబ్బంది రోడ్లపైనే విధులు నిర్వర్తించారు. సామాజికి దూరం పాటిస్తూ సేవలు అందిచడాన్ని ఖాతాదారులు అభినందించారు.
ప్రజల వద్దకే బ్యాంకు సిబ్బంది సేవలు - జన్‌ధన్ ఖాతాల్లో నగదు కోసం బారులు తీరిన ప్రజలు
జన్‌ధన్ ఖాతాల్లో నగదు జమ చేశామని ప్రభుత్వ ప్రకటనతో ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. వరంగల్ నగరంలోని మండి బజార్ వద్ద ఉన్న బ్యాంకు వద్దకు నగదు తీసుకోడానికి పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చారు. రద్దీని తగ్గించానికి బ్యాంకు అధికారులు రోడ్డుపైనే సేవలు అందించారు.

ప్రజల వద్దకే బ్యాంకు సిబ్బంది సేవలు
ప్రజల వద్దకే బ్యాంకు సిబ్బంది సేవలు