కరోనా కారణంగా వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ అధ్యాపకులు తమ విద్యార్థులకు ఆన్ లైన్లో బోధనలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలో భాగంగా మార్చి 22 లాక్ డౌన్ కంటే ముందే నిట్కి సెలవులు ప్రకటించడం వల్ల విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. తరగతులు నిలిపివేసే నాటికి వివిధ కోర్సుల విద్యార్థులకు మూడు వారాల తరగతులు మిగిలి ఉన్నాయి.
నిట్లో 320 మంది వరకూ బోధనా సిబ్బంది ఉండగా.. ఇప్పటికే 70 అధ్యాపకులు మిగిలిపోయిన తరగతులను ఆన్ లైన్లో బోధించేందుకు శిక్షణ పొంది తరగతులు నిర్వహిస్తున్నారు. వీరు గత 20 రోజుల్లోనే 1200 మంది విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులను పూర్తి చేశారు. మిగిలిన అధ్యాపకులు సైతం తమ పాఠ్యాంశాలను ఆన్ లైన్లో బొధించడంపై శిక్షణ పొందుతున్నారు.