తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐనవోలు మల్లన్న సన్నిధిలో మంత్రి సత్యవతి రాఠోడ్ - minister satyavathi rathod visited inavolu mallikarjuna swamy temple

వరంగల్​ పట్టణ జిల్లా ఐనవోలు మల్లన్నను మంత్రి సత్యవతి రాఠోడ్ దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

minister satyavathi rathod visited inavolu mallikarjuna swamy temple
ఐనవోలు మల్లన్న సన్నిధిలో మంత్రి సత్యవతి రాఠోడ్

By

Published : Jan 16, 2020, 3:57 PM IST

వరంగల్​ పట్టణ జిల్లా ఐనవోలు శ్రీమల్లిఖార్జున స్వామివారిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు బాజాభజంత్రీలతో మంత్రికి ఘనస్వాగతం పలికారు.

ఐనవోలు మల్లన్నను దర్శించుకోవడం పట్ల సత్యవతి రాఠోడ్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణలోని అన్ని దేవాలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మల్లన్నను కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఐనవోలు మల్లన్న సన్నిధిలో మంత్రి సత్యవతి రాఠోడ్

ఇవీ చూడండి : 'మకరజ్యోతి' దర్శనం.. భక్తజన పరవశం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details