తెలంగాణ

telangana

వరంగల్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌

By

Published : Mar 28, 2020, 1:38 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటోంది. వరంగల్‌ జిల్లాలో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా పోలీసులు రోడ్లపై చెక్‌పోస్టులు పెట్టి వాహనదారులను ఆపి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.

Lock Down Continue in Warangal
వరంగల్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న లాక్​డౌన్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం నిత్యవసర వస్తువులను కొనుగోలు చేయడానికి మాత్రమే ఎక్కువ సంఖ్యలో ప్రజలు బయటకు వస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిని పోలీసులు మందలిస్తున్నారు.

వరంగల్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌

హన్మకొండలోని వివిధ చోట్ల చెక్‌పోస్టులు పెట్టి వాహనాలను ఆపి వాహనదారులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. ఎక్కువ శాతం ప్రజలు ఇళ్లలోనే ఉండటం వల్ల ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు నిరంతరం రోడ్లపైనే ఉండి నగరవాసులను ఎవరిని బయటకు రానివటం లేదు. కూరగాయల మార్కెట్లు, కిరణాషాపులు తప్పా...మిగతా దుకాణాలు మూతపడ్డాయి.

ఇదీ చూడండి:కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి..

ABOUT THE AUTHOR

...view details