Kaloji Health University Notifications: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకుగాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్- 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తులు నమోదు చేసుకోవాలని వర్సిటీ అధికారులు తెలిపారు.
Kaloji Health University Notifications: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్
Kaloji Health University Notifications: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం... ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.
రేపు ఉదయం 8 గంటల నుంచి ఈనెల 11 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడం, అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇవీ చూడండి: