తెలంగాణ

telangana

By

Published : Mar 1, 2021, 2:02 PM IST

ETV Bharat / state

సజావుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్: కలెక్టర్ హనుమంతు

వరంగల్‌ పట్టణ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. తొలి వారంలో మూడు ఆస్పత్రుల్లో కొవిడ్‌ టీకా అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు వెల్లడించారు. ఎంజీఎంతో పాటు రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని తెలిపారు.

Interview with Warangal Districtcollector Hanumantha rao
సజావుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్: కలెక్టర్ హనుమంతు

వరంగల్ అర్బన్​ జిల్లాలో వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం పది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా వేస్తున్నారు. ఎంజీఎంతోపాటుగా రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ వేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు... ఆసుపత్రులకు వచ్చి కార్యక్రమాన్ని పరిశీలించారు. టీకా తీసుకునేవారు.. కొవిన్​ పోర్టల్లో​ నమోదు చేసుకుని....స్టాట్ బుక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

త్వరలోనే టీకా ఇచ్చే ఆసుపత్రుల సంఖ్య పెంచుతామని తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వృద్ధులు... హర్షం వ్యక్తం చేశారు. టీకా వల్ల భయపడాల్సినదేదీ లేదని చెపుతున్నారు. ఆఫ్ లైన్​లో కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details