లాక్డౌన్ కారణంగా నిత్యావసర సరుకుల కోసం వరంగల్ నగర వాసులు రోడ్లపైకి అధిక సంఖ్యలో వచ్చారు. ఆదివారం కావడం వల్ల మాంసం దుకాణాల వద్ద జనం బారులు తీరారు. కొవిడ్ నియమాలు పాటించకుండా కొందరు గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. నిత్యావసర సరుకుల దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, వస్త్ర దుకాణాలు, మద్యం షాపుల్లో జనం కిటకిటలాడారు.
రద్దీగా మారిన దుకాణాలు.. నిబంధనలు బేఖాతరు! - తెలంగాణ వార్తలు
ఆదివారం కావడంతో లాక్డౌన్ మినహాయింపు సమయంలో జనం అధిక సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. మాంసం దుకాణాల ముందు బారులు తీరారు. ఈ క్రమంలో కొందరు కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చర్యలు చేపట్టారు.
దుకాణాల్లో రద్దీ, వరంగల్ మార్కెట్లలో రద్దీ
కుమారపల్లి కూరగాయల మార్కెట్కు జనాలు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: 'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు.. నాటు మందు'