తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా హనుమాన్ శోభాయాత్ర - sri abhayanjneya

హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని కాజీపేటలోని జూబ్లీ మార్కెట్​లో హనుమాన్ ప్రతిమతో శోభాయాత్ర నిర్వహించారు.

హనుమాన్ శోభాయాత్ర

By

Published : May 28, 2019, 8:12 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని జూబ్లీ మార్కెట్​లో శ్రీ అభయాంజనేయ స్వామి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఊరేగింపు ముందు కోయ దొరల డప్పు వాయిద్యాలు, నృత్యాలు, మహిళల కోలాటాలు, గణపతి హనుమాన్ వేషధారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జైశ్రీరామ్.. జై హనుమాన్.. నినాదాలు, భక్తి గీతాలతో రహదారులన్నీ మార్మోగాయి. జూబ్లీ మార్కెట్​లోని దక్షిణ ముఖ అభయాంజనేయ స్వామి దేవాలయం 50 సంవత్సరాలుగా భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా మారిందని ఆలయ అర్చకులు జాగర్లమూడి శ్రీనివాస శర్మ తెలిపారు. ఈరోజు 108 లీటర్ల ఆవు పాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి, రేపు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

హనుమాన్ శోభాయాత్ర

ABOUT THE AUTHOR

...view details