తెలంగాణ

telangana

'ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం'

By

Published : Sep 24, 2020, 11:28 PM IST

రోజూ వివిధ పనులతో సతమతమవుతున్న వారికి వ్యాయామం ఎంతో ఉపశమనం కల్గిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. హన్మకొండలో జిల్లా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారు.

fit india
'ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం'

ప్రతి ఒక్కరూ పరుగు, నడక, యోగా ఏదో ఒక అంశాన్ని ఎంపిక చేసుకొని రోజూ సాధన చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ సూచించారు. హన్మకొండలో జిల్లా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 5కె పరుగు కార్యక్రమం చేపట్టారు. జె.ఎన్.ఎస్ మైదానం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని వరంగల్ మేయర్ గుండా ప్రకాష్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం కొద్ది దూరం పాటు వినయభాస్కర్ ఈ పరుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని....రోజూ వ్యాయామం చేయాలని అన్నారు. నిత్యం వివిధ పనులతో సతమతమవుతున్న వారికి వ్యాయామం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఫిట్​ ఇండియా: కోహ్లితో ప్రధాని మోదీ భేటీ

ABOUT THE AUTHOR

...view details