తెలంగాణ

telangana

By

Published : Dec 4, 2020, 2:03 PM IST

ETV Bharat / state

'లోక్ అదాలత్​లు వినియోగించుకోవాలి'

పరిష్కరించుకోవాలనుకున్న కేసులకు లోక్​ అదాలత్ మంచి అవకాశమని ఏసీపీ రవీంద్ర కుమార్ వెల్లడించారు. ఈనెల 12న జరగబోయే జాతీయ లోక్ అదాలత్​ను ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

acp ravindra said Lok Adalats should be utilized
'లోక్ అదాలత్​లు వినియోగించుకోవాలి'

ఈనెల 12న జరగబోయే జాతీయ లోక్ అదాలత్​పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ పోలీస్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సదస్సుకు కాజీపేట్ ఏసీపీ రవీంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని గ్రామాలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులకు లోక్ అదాలత్​పై అవగాహన కల్పించారు.

ఇరు వర్గాలు రాజీకి వచ్చి పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్న కేసులకు లోక్​ అదాలత్ మంచి అవకాశమని ఏసీపీ తెలిపారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. నేను సైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని సూచించారు.

ఇదీ చూడండి :ఎస్ఈసీ సర్క్యులర్‌ అమలును నిలిపివేసిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details