తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా వచ్చినా... యథేచ్చగా తిరుగుతున్నారు'

రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. కరోనా వచ్చినా... కొంత మంది యథేచ్చగా తిరుగుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్నారు. భీమదేవరపల్లి మండలంలోని బుడగ జంగాల కాలనీలో 30 కరోనా కేసులు వచ్చినా... వాళ్లు గ్రామంలో తిరుగుతున్నారు. దీనిపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

corona
'కరోనా వచ్చినా... యథేచ్చగా తిరుగుతున్నారు'

By

Published : Apr 16, 2021, 5:27 PM IST

Updated : Apr 16, 2021, 6:11 PM IST

ఓ వైపు కరోనా రెండో దశ రాష్ట్రంలో విజృంభిస్తుంటే... మరోవైపు పలుచోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వరంగల్​ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​లోని బుడగ జంగాల కాలనీలో ఈనెల 10వ తేదీన 30 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే వారికి అధికారులు, వైద్య సిబ్బంది, హోం క్వారంటైన్​ విధించిన దాఖలాలు కనబడుట లేదు. కరోనా వచ్చిన వ్యక్తులు గ్రామంలో యథేచ్ఛగా తిరుగుతున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు ఎందుకు వస్తున్నారని కరోనా వచ్చిన వ్యక్తులను అడిగితే ''తమకు కరోనా నెగిటివ్ వచ్చింది అందుకే బయటకు వస్తున్నాం'' అంటూ తెలుపుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు.

ఇంత వరకు తమ కాలనీవైపు ఏ అధికారులు, ప్రజా ప్రతినిధులు రాలేదని... తమ కాలనీలో నాలుగు వందల మంది వరకు ఉన్నామని తమకు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి బయటకి వెళ్తే... గ్రామస్థులు తమను గ్రామంలోకి రావద్దంటూ... వెళ్లగొడుతున్నారని బుడగ జంగాల కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

Last Updated : Apr 16, 2021, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details