తెలంగాణ

telangana

ETV Bharat / state

200 కిలోల గంజాయి పట్టివేత... నిందితుల అరెస్ట్ - ganjai_smaglarlu

వరంగల్ అర్బన్​ జిల్లాలో విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తోన్న ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గంజాయి స్మగ్లింగ్​ ముఠా అరెస్ట్
గంజాయి స్మగ్లింగ్​ ముఠా అరెస్ట్

By

Published : Dec 15, 2019, 9:07 PM IST

గంజాయి స్మగ్లింగ్​కు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయిని విశాఖపట్నం నుంచి తక్కువ ధరకు తీసుకువచ్చి విద్యార్థులకు అమ్ముతున్నారని ఈస్ట్ జోన్ డీసీపీ నాగరాజు తెలిపారు.

నిందితుల నుంచి 20 లక్షల విలువ చేసే 200 కిలోల గంజాయి, రెండు కార్లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులపై పీడీ యాక్టును నమోదు చేస్తామని వివరించారు. కమిషనరేట్​ను గంజాయి రహితంగా తీర్చిదిద్దుతామని డీసీపీ నాగరాజు వెల్లడించారు.

గంజాయి స్మగ్లింగ్​ ముఠా అరెస్ట్

ఇవీ చూడండి : భూమి కోసం తల్లీ కూతుర్ల ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details