వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని రాగన్నగూడెంలో వంద శాతం పన్నులు వసూలు చేస్తూ... గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. వీధి దీపాల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీ కార్యాలయంలో వసతులు కల్పించుకుంటున్నారు.
ఊరంతా వినిపించేలా మైక్...
సిద్దిపేటలోని ఓ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకున్న రాగన్నగూడెం సర్పంచ్... తమ ఊరిలో కూడామార్పు కోసం ప్రయత్నించాడు. అందరికి వినిపించేలా ఒక మైకు ఏర్పాటు చేశారు. పన్నులు చెల్లించడం, గ్రామంలో కల్పిస్తున్న సౌకర్యాల వంటి వివరాలు మైక్ ద్వారా ప్రజలకు చేరవేసేవారు.
వార్డు సభ్యులదే ముఖ్యభూమిక...
పన్నలు వసూలు చేయడంలో ముఖ్య భూమిక వార్డు సభ్యులదే. పాలకవర్గం ఆదేశాల మేరకు వార్డులోని అందరిచే బకాయిలు కట్టించే బాధ్యత తీసుకుని 100 శాతం పన్నులు వసూలులో సఫలమవుతున్నారు.
అవగాహాన కార్యక్రమాలు...
ఇంటి పన్ను, నీటి పన్నుపై ప్రజల్లో అవగాహాన కల్పించి అందరూ పన్ను కట్టెలా పంచాయతీ కార్యదర్శి అవగాహాన కార్యక్రమాలు చేపట్టారు. వచ్చిన సొమ్ముతో వీధి దీపాలు, సీసీ రోడ్లు, మరుగుదొడ్లు నిర్మించుకుని ప్రగతి సాధిస్తున్నారు.
ముందస్తు ప్రణాళిక...
పంచాయతీ పాలకులు వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, అవగాహాన కల్పించారు. గ్రామస్థులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకుంటూ... ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకొని స్వచ్ఛతకు పాటుపడుతున్నారు.
ఐదేళ్లుగా వంద శాతం బకాయిల వసూళ్లు
ఐదేళ్ల నుంచి వంద శాతం బకాయిలు వసూళ్లు చేసి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామస్థులను పలువురు అభినందిస్తున్నారు. పల్లెలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అనే నానుడిని నిజం చేస్తూ పలు గ్రామాలకు స్ఫూర్తినిస్తున్నారు రాగన్నగూడెం వాసులు.
ఇవీ చూడండి:ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చిన శునకం