రసాభాసగా భూమి రికార్డుల శుద్ధికరణ ప్రక్రియ - villagers
రెండో విడత భూమి రికార్డుల శుద్ధికరణ సభ రసాభాసగా మారింది. అన్ని వివరాలు ఉన్నా వీఆర్వో సరిగా స్పందించడంలేదని రైతులు వాపోయారు.
భూమి రికార్డుల శుద్ధికరణ ప్రక్రియ
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవించంద్రారెడ్డి పాల్గొన్నారు. అన్నీ వివరాలు సరిగా ఉన్నప్పటికీ వీఆర్వో పని చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వివరాలు పరిశీలించి భూమి రికార్డుల శుద్ధికరణ ప్రక్రియ త్వరితగతిన పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.