తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - వరంగల్​ గ్రామీణ జిల్లా

వరంగల్​ గ్రామీణ జిల్లా బూర్గుమల్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు అరూరి రమేష్​ ప్రారంభించారు. ప్రభుత్వం అప్పు చేసి మరీ ధాన్యం కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని... రైతులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.

mla aroori ramesh opened paddy purchase center in warangal rural district
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : May 3, 2020, 8:31 PM IST

రైతులు పండించిన పంటను ప్రభుత్వం అప్పు చేసి మరీ కొనుగోలు చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం బూర్గుమల్ల గ్రామంలో పర్వతగిరి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రమేష్ ప్రారంభించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని... పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడకుండా రైతులందరూ కొనుగోలు కేంద్రాల వద్ద భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద , పారిశుద్ధ్యం, త్రాగునీరు వంటి ఏర్పాట్లను తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. టోకెన్ పద్దతిలోనే ధాన్యం కొనుగోళ్లు చేయాలని అన్నారు. ప్రజలందరూ లాక్​డౌన్ నిబంధనలు పాటించాలని, అనవసరంగా రోడ్లపైకి రావద్దని సూచించారు. అనంతరం బూర్గుమల్ల గ్రామ స్వాగత తోరణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఇవీ చూడండి: వనస్థలిపురం కాలనీల్లో కంటైన్మెంట్ జోన్లు

ABOUT THE AUTHOR

...view details