అన్ని రకాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ గ్రామీణ జిల్లా రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఖానాపురం మండలం అశోక్ నగర్లో దొడ్డు ధాన్యాన్ని తీసుకొస్తే కొనుగోలు చేయట్లేదని ఆగ్రహించిన రైతులు ధర్నాకు దిగారు. అనంతరం ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి నిప్పంటించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా అన్ని రకాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
సన్న ధాన్యాన్నే కొంటే... దొడ్డు ధ్యాన్యం సంగతేంటి? - If you buy thin grain ... What about the bulged grains ?
వరంగల్ గ్రామీణ జిల్లాలో దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. మార్కెట్ అధికారుల చర్యలను నిరసిస్తూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ధాన్యం బస్తాను తగలబెట్టారు.
దొడ్డు రకం ధాన్యాన్నికొనాలని రోడ్డెక్కిన రైతులు