Foreigners visit warangal: గ్రామీణ ప్రాంతానికి పెట్టింది పేరు భారతదేశం. మన దేశానికి ఏటా ఎంతో మంది విదేశీయులు గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానంపై అధ్యయనం చేయడానికి వస్తారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో విదేశీయులు సందడి చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలోని పలు విషయాలపై అధ్యయనం చేసేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా బాలవికాస అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, పొదుపు సంఘాల పనితీరుపై అధ్యయనం చేశారు. అనంతరం పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో చిరు వ్యాపారుల వద్ద పండ్లు కొనుగోలు చేసి అక్కడి ప్రజలతో మమెకమై వారి జీవన విధానాలపై తమ కెమెరాల్లో బంధించుకున్నారు.