తెలంగాణ

telangana

ETV Bharat / state

జీరో ఎఫ్​ఐఆర్​ పద్ధతిలో తొలి కేసు నమోదు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన తర్వాత ఫిర్యాదు వచ్చిన వెంటనే... పరిధితో సంబంధం లేకుండా అన్ని పోలీస్ స్టేషన్లలో జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఓ అమ్మాయి అదృశ్యమైన కేసులో వరంగల్​ కమిషనరేట్​ పరిధిలో తొలి జీరో ఎఫ్​ఐఆర్ కేసు నమోదైంది.

By

Published : Dec 7, 2019, 5:33 PM IST

Updated : Dec 7, 2019, 7:02 PM IST

First
సుబేదారి పోలీస్​స్టేషన్​లో జీరో ఎఫ్​ఐఆర్​

రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. వరంగల్ ​నగర కమిషనరేట్ పరిధిలోని సుబేదారి స్టేషన్ పోలీసులు... జీరో ఎఫ్ఐఆర్ కేసును నమోదు చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్​కు చెందిన రవీందర్ కుమార్తె అదృశ్యమైంది. ఆందోళనకు గురైన రవీందర్... హన్మకొండలో ఉంటున్న తన తమ్ముడు రాజ్ కుమార్​కు సమాచారం అందించారు. వెంటనే రాజ్​కుమార్... సమీపంలో ఉన్న సుబేదారి పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి... దర్యాప్తు నిమిత్తం కేసును.... శాయంపేట పోలీస్ స్టేషన్​కు తరలించారు. తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులను నగర పోలీస్ కమిషనర్ వీ రవీందర్ అభినందించారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన తర్వాత ఫిర్యాదు వచ్చిన వెంటనే... పరిధితో సంబంధం లేకుండా అన్ని పోలీస్ స్టేషన్లలో జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు... వరంగల్ గ్రామీణ జిల్లాలో అమ్మాయి అదృశ్య ఘటనకు సంబంధించి కేసు నమోదైంది.

జీరో ఎఫ్​ఐఆర్​ పద్ధతిలో తొలి కేసు

ఇదీ చూడండి:ఉత్తర్​ప్రదేశ్​లో మహిళలకు చోటేది: ప్రియాంక గాంధీ

Last Updated : Dec 7, 2019, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details