తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తోరోకో - farmers protest

వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం పాఖాల ఆయకట్టు రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాలు అధికంగా కురవడం వల్ల దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తోరోకో
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తోరోకో

By

Published : Dec 30, 2019, 11:47 PM IST

వరిధాన్యాన్ని కోతల్లేకుండా కొనుగోలు చేయాలని... వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురంలో పాఖాల ఆయకట్టు రైతులు రాస్తారోకో చేపట్టారు. జాతీయ రహదారిపై దాదాపు రెండు గంటలపాటు ఆందోళన చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వర్షాలు అధికంగా కురవడం వల్ల దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 1075 రకంతోపాటు పలు రకాల దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. రైతులు నష్టాల్లో ఉన్నా... అధికారులు కనికరించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తోరోకో

ABOUT THE AUTHOR

...view details