వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం పోలీసులు తీవ్రంగా ఒత్తిడిని పెంచారు. నర్సంపేట నియోజకవర్గంలో అకారణంగా రోడ్లపై రాకూడదని సూచించారు. వాహనాలపై వచ్చే ప్రతీ వ్యక్తిని విచారిస్తూ కరోనా తీవ్రతను వివరిస్తున్నారు.
రోడ్లపైకి రావొద్దు.. వస్తే దబిడి దిబిడే ! - lockdown
వరంగల్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో అనవసరంగా రోడ్లపై రాకూడదని హెచ్చరిస్తున్నారు. వచ్చిన వారికి దేహశుద్ది చేసి పంపుతున్నారు.
అనవసరంగా రోడ్లపైకి రావొద్దు.. వస్తే దేహశుద్ది !
నిత్యావసర, పండ్ల దుకాణాలను సైతం మధ్యాహ్నం లోపే బంద్ చేయించారు. నర్సంపేట పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ కూడలి రోడ్డుపై కరోనా మహమ్మారిని ప్రారదోలే విధంగా పలు చిత్రాలను గీశారు. ఇంట్లోనే ఉండండి కరోనాను తరిమి వేయండనే నినాదాలతో రోడ్లపై పేయింటింగ్ వేశారు. అకారణంగా తిరిగే ఆకతాయిలకు దేహశుద్ది చేసి పంపుతున్నారు.
ఇదీ చూడండి :ఔషధాల లేమి... పొంచి ఉన్న ప్రమాదం