తెలంగాణ

telangana

ETV Bharat / state

పుర ఓట్ల లెక్కింపునకు జోరుగా ఏర్పాట్లు - వరంగల్ గ్రామీణ జిల్లా వార్తలు

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో రేపు జరిగే పుర ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి మహేందర్ తెలిపారు.

Completion of arrangements for the counting of votes at warangal rural district
పుర ఓట్ల లెక్కింపుకు జోరుగా ఏర్పాట్లు

By

Published : Jan 24, 2020, 6:39 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో రేపు జరిగే పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి మహేందర్ పేర్కొన్నారు. మొత్తం 12 వార్డులకు వార్డుకొక టేబుల్​ చొప్పున ఏర్పాటు చేశామన్నారు. 52 మంది అధికారులు విధులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

రీ కౌంటింగ్​కు అవకాశం లేకుండా ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పారదర్శకంగా ఓట్ల కౌంటింగ్ జరుగుతుందని, సిబ్బందికి ఇప్పటికే పూర్తి అవగాహన కల్పించామని అన్నారు. పోలీసు సిబ్బంది సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అందుకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారన్నారు.

పుర ఓట్ల లెక్కింపునకు జోరుగా ఏర్పాట్లు

ఇదీ చూడండి : చిన్నారి అపహరణ కేసు సుఖాంతం..

ABOUT THE AUTHOR

...view details