ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎదుగుదలను ఓర్వలేక పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్, తెరాస, వామపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునంధన్ రావు పిలుపునిచ్చారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో పౌరసత్వ సవరణ చట్టంపై భాజపా కార్యకర్తలకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు.
'పౌరసత్వ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి' - latest news on bjp ragunandan rao
వరంగల్ రూరల్ జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్లో భాజపా కార్యకర్తలకు పౌరసత్వ సవరణ చట్టంపై వర్క్‌షాప్ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పౌరసత్వ సవరణ చట్టంపై పూర్తి అవగాహన లేకే పలు పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. కార్యకర్తలు ఈ చట్టంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఫంక్షన్ హాలు నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి రఘునందన్‌రావు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: "ఎన్నికల సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి"