తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్​ మాట్లాడుతుందనే అనుమానంతో భార్యను చంపిన భర్త - telangana news

అనుమానం పెను భూతమైంది... భార్య ప్రాణాన్ని తీసింది... ఆ పిల్లలకు తల్లిని లేకుండా చేసింది. పిల్లలు అమ్మా అమ్మా అంటూ చేస్తున్న రోదనలు స్థానికుల హృదయాలను కలిచి వేస్తున్నాయి. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురంలో చోటుచేసుకుంది.

a-husband-who-killed-his-wife-on-suspicion-of-talking-to-the-phone
ఫోన్​ మాట్లాడుతుందనే అనుమానంతో భార్యను చంపిన భర్త

By

Published : Jan 1, 2020, 3:07 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పల్లెబోయిన సంపత్ తన భార్యతో కలిసి రేగొండ మండలం వెంకటేశ్వర్లుపల్లిలో జీవిస్తున్నారు. సెల్​ఫోన్ అధికంగా మాట్లాడుతోందనే అనుమానంతో భర్త భార్యను చంపేశాడని సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెద్దపాప హర్షిత(12), మున్నా(9)ల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తంపరకాలలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.

ఫోన్​ మాట్లాడుతుందనే అనుమానంతో భార్యను చంపిన భర్త

ABOUT THE AUTHOR

...view details