వనపర్తి జిల్లాలోని ప్రతి అధికారి హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. పానుగల్లు మండలంలో పర్యటించిన ఆమె అన్నారం, గోపాలపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను సందర్శించారు. మొక్కల పెంపకంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.
'ప్రతి ఒక్కరూ హరితహారంపై దృష్టి సారించాలి'
వనపర్తి జిల్లా పానుగల్లు మండలంలోని అన్నారం, గోపాలపురం గ్రామాల్లోని పలు నర్సరీలను కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సందర్శించారు. ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని ఆమె సూచించారు.
నర్సరీలను సందర్శించిన కలెక్టర్ యాస్మిన్ బాషా
నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవాటితో వెంటనే భర్తీ చేయాలని వన సేవకులను ఆదేశించారు.
ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస