సరళాసాగర్‌కు గండి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. రెండో పంటకు ప్రత్యామ్నాయం చూపిస్తామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
సరళాసాగర్ గండికి కారణాలు ఆపాదించొద్దు: నిరంజన్ రెడ్డి - minister on sarala sagar project
వనపర్తి జిల్లాలో గండి పడిన సరళాసాగర్ ప్రాజెక్టును మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. గండికి కారణం ఏంటనేది సాంకేతిక బృందం పరిశీలిస్తుందని తెలిపారు. యాసంగి పంటకు రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
'ఈ గండికి కారణాలు ఆపదించొద్దు'
కట్ట పునరుద్ధరణకు రెండుమూడ్రోజుల్లో పనులు మొదలు పెడతామని చెప్పారు. 30 ఏళ్ల కాలంలో రెండు మూడు సార్లు మాత్రమే ప్రాజెక్టు నిండిందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: వనపర్తి సరళాసాగర్ జలాశయానికి గండి... వృథాగా పోతున్న నీరు
Last Updated : Dec 31, 2019, 12:37 PM IST