తెలంగాణ

telangana

ETV Bharat / state

'పర్యటక ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా ప్రణాళిక'

పర్యటక ప్రదేశాల్లో చెత్త పేరుకు పోకుండా అటవీ, మున్సిపల్ అధికారులతో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. అనంతగిరి అటవీ ప్రాంతంలో నిర్వహించిన ప్లాగథాన్​లో పాల్గొన్నారు.

vikarabad mla methuku anand
అనంతగిరిలో ప్లాగథాన్

By

Published : Jan 17, 2021, 2:13 PM IST

వికారాబాద్‌ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో ప్లాగథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్యలు జెండా ఊపి ప్రారంభించారు. అటవీ, మున్సిపల్‌ శాఖలతో పాటు వికారాబాద్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ ప్లాగథాన్‌ జరిగింది.

వాకర్స్ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడి చెత్తను ఏరివేశారు. తెలంగాణ ఊటీగా పేరుగాంచిన అనంతగిరిలో పర్యటకులు ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలని వారు కోరారు. పర్యటక ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా అటవీ, మున్సిపల్ అధికారులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆనంద్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details