వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం నాగులపల్లి గ్రామంలోని పొలాల్లో ఎలుగు బంటి సంచరిస్తోంది. గ్రామానికి చెందిన బాయికాడి హనుమంతు అనే రైతు తన పొలంలో... ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గమనించి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. విషయాన్ని సదరు రైతు... గ్రామస్థులకు తెలియజేశాడు. అనంతరం అందరూ కలిసి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ పరిసరాల్లో భల్లూకం సంచరిస్తున్నట్లు గ్రామం మెుత్తం వ్యాపించడం వల్ల పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు.
ఎలుగుబంటి సంచారం... నాగులపల్లి వాసుల్లో గుబులు - Elugubanti
అడవుల్లో తిరగాల్సిన ఎలుగు బంటి పొలాల్లో సంచరిస్తోంది. పొలంలో భల్లూకాన్ని గమనించిన ఓ రైతు తీవ్ర భయాందోళనకు లోనయ్యాడు. విషయాన్ని గ్రామస్థులతో చెప్పిన అనంతరం సదరు రైతు వారితో కలిసి అటవీ శాఖాధికారులకు ఫిర్యాదు చేశాడు.
నాగులపల్లిలో ఎలుగుబంటి సంచారం... గ్రామస్థుల్లో టెన్షన్