రాష్ట్రంలో సీఎం కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని మాల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2014 ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల విలువ రూ.8 కోట్లు ప్రకటించారని... 2018లో రూ.41 కోట్ల ఆస్తి పెరగటం వెనక రహస్యమేంటని ప్రశ్నించారు. తెరాసకు రూ.188కోట్ల విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ఆస్తులపై విచారణ జరిపించాలి: రేవంత్ రెడ్డి - కేటీఆర్ ఆస్తులపై విచారణ జరిపించాలి: రేవంత్ రెడ్డి
2014లో రూ.8 కోట్లుగా ఉన్న కేటీఆర్ ఆస్తి.. 2018లో రూ.41 కోట్లకు పెరగడం వెనుక రహస్యమేంటని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కొడంగల్లో ప్రశ్నించారు. తెరాస విరాళాలు రూ.188 కోట్లకు పెరగడం వెనుక రాజకోట రహస్యమేంటని ప్రశ్నించారు. ఈ ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.
కేటీఆర్ ఆస్తులపై విచారణ జరిపించాలి: రేవంత్ రెడ్డి
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి తండ్రీకొడుకులు వ్యక్తిగత ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేటీఆర్ చేపట్టిన శాఖలపై విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రిని, గవర్నర్ను, కోర్టును కొరనున్నట్లు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో కేటీఆర్ భూ కుంభకోణాలకు పాల్పడినట్లు ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు