అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో పర్యటించిన మంత్రి.. ఇల్లు కూలి మృతి చెందిన రాజు కుటుంబాన్ని పరామర్శించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన
మూడ్రోజుల పాటు కురిసిన వర్షానికి నీటమునిగిన పంట పొలాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. వికారాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి.. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ మండలం నారాయణపూర్‌లో రైతు వేదిక భవనం, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. మోమిన్‌పేట మండలంలోని మిట్యానాయక్ తండాను సందర్శించిన మంత్రితో.. వర్షం పడిన ప్రతిసారి ఇళ్లలోకి వరద నీరు వస్తోందని తండా వాసులు తమ గోడు వెల్లబోసుకున్నారు. సానుకూలంగా స్పందించిన సబితా ఇంద్రారెడ్డి.. వారికి వేరే చోట ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అకాల వర్షం, వరదలతో జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి తెలిపారు.
- ఇదీ చదవండి :టోలీచౌకి నదీమ్ కాలనీలో మంత్రి కేటీఆర్ పర్యటన