వికారాబాద్ జిల్లా పరిగిలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కందులు కొనేందుకు ఈ నెల 3న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. నేటికి 25 రోజులు గడిచినా ఒక్క క్వింటా కూడా కొనలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరానికి ఐదు నుంచి ఏడు క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుందని కానీ కొనుగోలు కేంద్రంలో మాత్రం రెండున్నర క్వింటాళ్ల కందులు కొనుగోలు చేస్తామని చెబుతున్నారని అన్నదాతలు వాపోతున్నారు. ఆగ్రహించిన కర్షకులు హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు.
రోడ్డెక్కిన కంది రైతులు - farmars protest for minimum price to red grams in parigi
కంది పంట వేసిన రైతులకుకు కొత్త కష్టం వచ్చి పడింది. పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో అమ్మేందుకు వెళ్ళిన అన్నదాతలకు నిబంధనల పేరుతో ఉబ్బందులు పెడుతున్నారు. ఆగ్రహించిన కర్షకులు పరిగిలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు.
రోడ్డెక్కిన కంది రైతులు
TAGGED:
రోడ్డెక్కిన కంది రైతులు