తెలంగాణ

telangana

ETV Bharat / state

భూమి హక్కులపై ఆర్ఐతో వాగ్వాదం.. మహిళ మృతి - నిర్వాసితులు

నిర్వాసితుల భూమి హక్కు పత్రాలను పరిశీలించేందుకు వచ్చిన అధికారితో జరిగిన వాగ్వాదంలో.. ఓ మహిళ మృతి చెందింది. సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

woman was deid in an altercation with ri in suryapet
'ఆర్ఐతో వాగ్వాదానికి దిగి.. ఓ మహిళ మృతి'

By

Published : Dec 30, 2020, 1:17 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడులో నిర్వాసితుల భూమి హక్కు పత్రాలను పరిశీలించేందుకు వచ్చిన ఆర్ఐతో స్థానిక మహిళలు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది.

బాధితురాలు మోతి(54) ను ఆసుపత్రికు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే.. గుండె పోటుతో మృతి చెందింది. ఆర్ఐ కారణంగానే మోతి చనిపోయిందంటూ.. కుటుంబసభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:మల్లన్నసాగర్ నిర్వాసితుల వంటా వార్పు

ABOUT THE AUTHOR

...view details