సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురం స్టేజీ వద్ద గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. బేతవోలు గ్రామానికి చెందిన రైతు కొండాపురం నుంచి ట్రాక్టర్లో గడ్డిని తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. స్వల్పగాయాలతో డ్రైవర్ బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. కరెంటు తీగలు కిందికి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం - suryapet district
గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్కు ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగిలి పూర్తిగా దగ్ధమైన ఘటన సూర్యాపేట జిల్లా కొండాపురంలో జరిగింది. కరెంటు తీగలు కిందికి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం