అదుపు తప్పి కల్వర్డును ఢీకొన్న కారు... ఇద్దరు మృతి - kalwart
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు హైదరబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిన వెంటనే కిరణ్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో లోకేశ్ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరందరూ మల్కాజిగిరికి చెందిన వ్యక్తులుగా పోలీసులు నిర్ధారించారు.