తెలంగాణ

telangana

ETV Bharat / state

Public Protests in Telangana : అసెంబ్లీ ఎన్నికల ముంగిట.. ప్రజల ఆందోళనల బాట - protests against dalitbandhu

Public Protests in Telangana : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముంగిట డిమాండ్ల సాధన కోసం ప్రజలు, ఉద్యోగులు, వివిధ సంఘాల నేతలు వివిధ రూపాల్లో ఆందోళన చేపడుతున్నారు. దళితబంధు పూర్తిగా అమలు చేయాలంటూ దళితులు, క్రమబద్దీకరణ చేపట్టాలంటూ రెండో ఏఎన్​ఎంలు, కారుణ్య నియామకాల కోసం వీఆర్వోలు నినదించారు. ప్రభుత్వం నుంచి హామీ వస్తే.. అపరిష్కృత సమస్యలకు మోక్షం కలుగుతుందని భావిస్తున్నారు.

Telangana Assembly Elections 2023
Public Protests in Telangana

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2023, 7:48 PM IST

Public Protests in Telangana అసెంబ్లీ ఎన్నికల ముంగిట ప్రజల ఆందోళనల బాట

Public Protests in Telangana: రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైన తరుణంలో ప్రజలు నిరసనల బాట పట్టారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో ఎస్సీలందరికీ దళితబంధు అమలు చేయాలంటూ బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన నిరసనకారులు.. అనర్హులకు దళితబంధు ఇస్తున్నారంటూ ఆక్షేపించారు. పాలకవీడు మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం వచ్చిన హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డిని బొత్తలపాలెంవాసులు అడ్డుకున్నారు. దళితబంధు లబ్దిదారుల కేటాయింపులో రాజకీయాలు మాని అర్హులైన వారందరికీ మంజూరు చేయాలని కోరారు. పోలీసులు జోక్యం చేసుకుని నిరసనను నిలువరించారు.

Protest at KTR Banswada Meeting : బాన్సువాడలో మంత్రి కేటీఆర్​కు నిరసన సెగ

Telangana Assembly Elections 2023: నేరేడుచెర్ల మండలం దిర్శించెర్ల పంచాయతీ కార్యాలయం ఎదుట దళితబంధు కోసం ధర్నా చేపట్టారు. అనంతరం మేళ్లచెర్వు సర్పంచ్ ఇంటిని ముట్టడించారు. పార్టీలతో సంబంధం లేకుండా దళితబంధు నిజమైన పేదలకు ఇవ్వాలని నినదించారు. గృహలక్ష్మి, దళితబంధు లబ్దిదారుల ఎంపికలో పక్షపాతం చూపుతున్నారని, అనర్హులను లబ్దిదారుల జాబితాలో చేర్చుతున్నారంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రజలు ముట్టడించారు. కార్యాలయ గేట్లు నెట్టుకొని అందోళనకారులు లోపలికి పరుగులు పెట్టారు. కాంగ్రెస్, సీపీఎం సహా వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.

Protest Against MLA Saidireddy Suryapet : 'నేను పనిచేయకపోతే అడగండి.. కానీ ఇలా రోడ్లెక్కి ధర్నాలొద్దు'

సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్‌ ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ వద్ద రెండో ఏఎన్​ఎంలు ఆందోళన చేపట్టారు. సర్వీస్ క్రమబద్ధీకరించాలని నినదించారు. 100 శాతం గ్రాస్ శాలరీ జీవో వచ్చే వరకు పోరాటం ఆగేది లేదని రెండో ఏఎన్ఎంలు స్పష్టం చేశారు. వయో పరిమితి సడలింపు, వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలు తక్షణం చేపట్టాలని వీఆర్వోల వారసులు, కుటుంబీకులు గళమెత్తారు. నాంపల్లి స్టేషన్ రోడ్‌లోని భూ పరిపాలన శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 178 కుటుంబాలు కారుణ్య నియామకాలు లేక రోడ్డునపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా.. ఫలితం లేదని వాపోయారు.

Adivasi Padayatra at Adilabad : మళ్లీ తెరపైకి ఆదివాసీ ఉద్యమం.. ఇళ్లస్థలాలు, పట్టాలకై చలో ప్రగతి భవన్‌

హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించి పీవీ పేరు పెట్టాలంటూ అఖిలపక్షం నాయకులు హుజూరాబాద్‌లో ఆందోళనకు దిగారు. హుజూరాబాద్‌ జిల్లా సాధన సమితి ఐకాస జడ్పీ పాఠశాల నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు. అఖిలపక్షం నేతలతో పాటు అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని స్థానికులు డిమాండ్ చేశారు. జుక్కల్ యూత్ ఫోరం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

Asha Workers Protest : కనీస జీతాలు చెల్లించాలంటూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల నిరసనలు

ABOUT THE AUTHOR

...view details