సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ కోసం తమ ఇంటి ముందు గుంత తవ్వగా ఆవుల సుబ్బారావు అనే వ్యక్తి అవమానకరంగా మాట్లాడారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో పరస్పరం దూషించుకుంటూ దాడి చేసుకున్నారు.
తమపై దాడి చేసి గాయపరిచారని ఫిర్యాదు చేసినా నిందితుడు సుబ్బారావుని అరెస్టు చేయట్లేదని పోలీస్ ఠాణా ముందు బాధితురాలు ధర్నా చేపట్టింది. నిందితుడిని ఠాణాకు తీసుకువచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. నిందితుడు సుబ్బారావు అనారోగ్యంతో ఉండటం వల్లే అరెస్టు చేయలేదని ఎస్ఐ గోవర్ధన్ స్పష్టం చేశారు.
'అతన్ని ఠాణాకు తీసుకొచ్చే వరకు ఆందోళన ఆగదు' - MISSION BAGIRADHA PIPE LINE
తాగు నీటి కోసం ఇంటి ముందు తవ్విన గుంత విషయంలో తలెత్తిన ఘర్షణ చివరకు ఠాణాకు చేరుకుంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన విరమించబోమని బాధిత మహిళ భీష్మించారు.
నిందితుడిని ఠాణాకు తీసుకువచ్చే వరకు ఇక్కడ్నుంచి కదలం