సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద పలు సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, ఎన్సీఏ చట్టాలు రద్దు చేయాలని రాజ్యాంగ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ రద్దుకై.. కళ్లగంతలతో నిరసన - Protest Against Nrc In Suryapet
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, ఎన్సీఏ రద్దు కోరుతూ సూర్యాపేటలో నిరసనలు వెల్లువెత్తాయి.

ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ రద్దుకై.. కళ్లగంతలతో నిరసన
అనంతరం ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, ఎన్సీఏ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సీపీఎం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి గాడ్సే దిష్టిబొమ్మ దహనం చేశారు. వివిధ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు బీజేపీ ప్రభుత్వానికి తగదని నాయకులు విమర్శించారు.
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ రద్దుకై.. కళ్లగంతలతో నిరసన