ప్రతిపక్షాలు ఎన్నికుట్రలు చేసినా అంతిమంగా హుజూర్నగర్లో తెరాస జెండా ఎగటం ఖాయమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ప్రచార సమయంలో ఎంపీ రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హుజుర్నగర్లో పద్మావతికి టికెట్ ఇవోద్దని వ్యతిరేఖించిన రేవంత్రెడ్డి... ఎన్నికల ప్రచారంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. కోమటిరెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని పల్లా హితవు పలికారు.
'ఎన్ని కుట్రలు చేసినా హుజూర్నగర్లో తెరాసదే విజయం' - PALLA RAJESHWAR REDDY ON REVNATHRADDY, KOMATIREDDY IN HUZURNAGAR BY ELECTIONS
హుజూర్నగర్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. ఎంపీ రేవంత్రెడ్డి, కోమటిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

PALLA RAJESHWAR REDDY ON REVNATHRADDY, KOMATIREDDY IN HUZURNAGAR BY ELECTIONS
'ఎన్ని కుట్రలు చేసినా హుజూర్నగర్లో తెరాసదే విజయం'
ఇవీ చూడండి: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండి: హైకోర్టు