రాష్ట్రంలో మార్పు హుజూర్నగర్ నుంచే రావాలని.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడితో కలిసి రేవంత్... పాలకవీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి, మఠంపల్లి మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. ముందుగా పాలకవీడు మండల కేంద్రం నుంచి రోడ్ షో మొదలు కాగా, కేసీఆర్ సర్కారుపై రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను వదిలిపెట్టి... కేవలం హుజూర్నగర్నే అభివృద్ధి చేస్తామంటూ ఓట్ల కోసం తెరాస నేతలు వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో మార్పు హుజూర్నగర్ నుంచే రావాలి: రేవంత్ - రాష్ట్రంలో మార్పు హుజూర్నగర్ నుంచే రావాలి: రేవంత్
హుజూర్నగర్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమే కానీ... ఎంత మెజార్టీ ఇస్తారన్నదే ఇప్పుడు ప్రధానాంశమని ఎంపీ రేవంత్రెడ్డి తెలిపారు. హుజూర్నగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా పలు మండలాల్లో పర్యటించిన రేవంత్.. సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

MP REVANTHREDDY FIRE ON CM KCR IN HUZURNAGAR BY ELECTIONS
రాష్ట్రంలో మార్పు హుజూర్నగర్ నుంచే రావాలి: రేవంత్
ఇవీ చూడండి: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండి: హైకోర్టు