సూర్యపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 19వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థి అట్లూరి హరిబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రచారం - ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రచారం
హుజూర్‌నగర్‌లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రచారం నిర్వహించారు. తనను గెలిపించినట్లే తెరాస అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రచారం
పట్టణం అభివృద్ధి చెందాలంటే తెరాసతోనే సాధ్యమవుతోందని ఎమ్మెల్యే తెలిపారు. హుజూర్‌నగర్‌ను మోడల్ సిటీగా మార్చేందుకు కేసీఆర్ ఇప్పటికే 25 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. తెరాస పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఓటర్లకు సూచించారు.
హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రచారం
ఇవీ చూడండి: ఆ రెండు మున్సిపాలిటీల్లో గెలుపు మాదే: మంత్రి ఈటల