తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2020, 8:09 PM IST

ETV Bharat / state

రెడ్​ జోన్​ ప్రాంతాల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటన

సూర్యాపేట జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజల్లో భరోసా కల్పించేందుకు రెడ్​ జోన్​ ప్రాంతాల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటించారు. లాక్​డౌన్​ నిబంధనలు పాటించి, ప్రజలు సహకరించాలని సూచించారు.

minister jagadish reddy visit red zons in suryapeta
రెడ్​ జోన్​ ప్రాంతాల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటన

సూర్యాపేట జిల్లాలో కరోనా కలవరం రేపుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం వల్ల జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు మంత్రి జగదీశ్​ రెడ్డి... రెడ్​ జోన్ ప్రాంతాల్లో పర్యటించి లాక్​డౌన్ సందర్బంగా చేపడుతున్న చర్యలు వివరించి సహకరించాలని ప్రజలను కోరారు. సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇవాళ 15 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా నేటికి మొత్తం కేసులు 55 అయ్యాయి. అప్రమత్తమైన మంత్రి జగదీష్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రజల భయపడకుండా స్వయంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో పర్యటించి కరోనా నివారణకు చేపడుతున్న చర్యలు ప్రజలకు వివరించారు.

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్​తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. కొత్తగా నమోదైన కేసులన్నీ ప్రైమరీ కాంటాక్టుల ద్వారా సంక్రమించినవేనని, కేసుల తీవ్రత పెరిగే అవకాశాన్ని ముందే ఊహించి లోతుగా విచారించినట్టు తెలిపారు. అనుమానిత ప్రాంతాల్లో హెల్త్ సర్వే చేపట్టి కరోనా సోకిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్టులను క్వారంటైన్ చేసి, ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు.

రెడ్ జోన్ ప్రాంతాల్లోని ప్రజల నిత్యావసరాలను తీర్చేందుకు మీ-కోసం యాప్ అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. ప్రజల ఇంటివద్దకే వెళ్లి సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు అందుతున్న సేవలను పర్యవేక్షించేందుకు ప్రతి రెడ్ జోన్​కు ఒక నోడల్ అధికారిని నియమించినట్టు వివరించారు. ప్రభుత్వం సూచించిన లాక్​డౌన్ నిబంధనలు పాటించి, స్వీయ నియంత్రణలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో మంత్రి పర్యటనతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

రెడ్​ జోన్​ ప్రాంతాల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటన

ఇదీ చూడండి:పింఛన్​దారులకు కరోనా వస్తే పరిస్థితేంటి..?

ABOUT THE AUTHOR

...view details