మహరాష్ట్రకు చెందిన వలస కూలీలకు ఉపాధి హామీ కూలీలు అన్నంపెట్టి ఆదరించారు. నల్గొండ జిల్లా కేంద్ర నుంచి కాలినడకన బయలుదేరిన వారికి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్లసింగారం వద్ద ఉపాధి హామీ కూలీలు అన్నం పెట్టారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రోజూవారి కూలీలుగా జీవనం గడుపుతున్న వీరికి లాక్డౌన్ వల్ల పని దొరకకుండా పోయింది. దీంతో పస్తులు ఉండలేక వారి స్వస్థలాలకు కాలినడకన బయలుదేరారు.
నల్గొండ నుంచి సుమారు 85 కిలోమీటర్ల ప్రయాణం చేసి గుండ్లసింగారం గ్రామాన్ని చేరుకొని చెట్టు కింద సేద తీర్చుకున్నారు. ఉపాధి హామీ కూలీలు తాము తెచ్చుకున్న మధ్యాహ్నం భోజనం వారికి అందించారు. నూతనకల్ హమాలీలు వారికి బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు ఇచ్చారు. స్థానిక ఎంపీపీ కళావతి వారికి అరటి పండ్లు అందించి వరంగల్ వరకు వెళ్లేందుకు టాటా ఏస్ వాహనాన్ని ఏర్పాటు చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
వలస కూలీలను ఆదుకున్న ఉపాధి హామీ కూలీలు
నల్గొండ జిల్లా కేంద్రం నుంచి కాలినడకన బయలుదేరిన మహారాష్ట్ర వలస కూలీలను సూర్యాపేట జిల్లాలో ఉపాధి హామీ కూలీలు అన్నంపెట్టి ఆదరించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ ఎంపీపీ కళావతి వరంగల్ వెళ్లేందుకు టాటా ఏస్ వాహనాన్ని ఏర్పాటు చేశారు.
వలస కూలీలను ఆదుకున్న ఉపాధి హామీ కూలీలు