రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు భృతి ఇవ్వకపోవడంతో ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై పట్టభద్రుల సమావేశం నిర్వహించారు.
నిరుద్యోగులు ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు: కోదండరాం
నీళ్లు, నిధులు, నియామకాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోయారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉపాధి లేక కూలీ పనులకు వెళ్తున్నారని అన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.
నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ హామీలను మరిచిపోయారని అన్నారు. రాబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, జిల్లా అధ్యక్షులు గట్ల రమాశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు మాండ్ర మల్లయ్య, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, ప్రైవేట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర నాయకులు చందు, శ్రీధర్, మండల కన్వీనర్ చెవ్వు శ్రీను, ప్రియాంకర్, యాసిన్, అనిల్, నరేష్, సందీప్, యూనస్, స్వామి, లక్ష్మణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.