సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలంలోని తాళ్లసింగారంలో ప్రతి ఇంటికి ఐదు రకాల కూరగాయలను పంపిణీ చేశారు. శ్రీ దుర్గాభవాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారం రోజులకు సరిపడా సరకులు అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామస్తులకు సరిపడా కూరగాయలను కొనుగోలు చేసి అందించినట్లు శ్రీదుర్గాభవానీ ఫౌండేషన్ అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి విజయ్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చూడి లింగారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు తండు రేణుక, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
దుర్గాభవాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ - తుంగతుర్తి తాళ్ళసింగారంలో కూరగాయల పంపిణీ
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తాళ్లసింగారంలో ఇంటింటికి కూరగాయలను పంపిణీ చేశారు. గ్రామస్తులు ఆకలితో ఇబ్బందులు పడకూడదనే సరకులు అందించామని శ్రీ దుర్గాభవాని ఫౌండేషన్ పేర్కొంది.
తాళ్లసింగారంలో ఇంటింటికి కూరగాయలు అందజేత