సూర్యాపేట జిల్లా వర్ధమానుకోట గ్రామాన్ని కట్టడి ప్రాంతంగా ప్రకటించింది ప్రభుత్వం. ఫలితంగా ప్రజలెవరూ నిత్యావసర సరకులకు ఇబ్బంది పడకుండా ఎంపీ కోమటిరెడ్డి తొమ్మిది రకాల సరకులను పంపిణీ చేయించారు. గ్రామంలో అదనపు కలెక్టర్ సంజీవరెడ్డి చేతుల మీదుగా సుమారు వెయ్యి కుటుంబాలకు సరకులు అందించారు.
వర్ధమానుకోటలో ఎంపీ కోమటిరెడ్డి సరకుల వితరణ - భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి ఔదార్యం
సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుమారు రూ.10 లక్షల రూపాయల విలువ గల కిరాణా సామగ్రిని అందించారు. అదనపు కలెక్టర్ చేతుల మీదుగా వెయ్యి కుటుంబాలకు అందజేశారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఔదార్యం
నిరుపేదలను, కూలీలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కూరగాయలు, నిత్యావసర సరకులను ఎంపీ కోమటిరెడ్డి పంపించారని అదనపు కలెక్టర్ అన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా నిత్యావసర సరకులను అందిస్తామన్నారు. ఇంత పెద్ద మెుత్తంలో సరకుల వితరణ చేస్తున్నందుకు ప్రభుత్వం, ప్రజల తరఫున ఎంపీకీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు.